HomeTelugu Trendingప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు: శృతిహాసన్‌

ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు: శృతిహాసన్‌

Shruti haasan about Prabhasశృతిహాసన్ ఇటీవలే ‘క్రాక్‌’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా.. సలార్ గురించి మాట్లాడింది శృతిహాసన్‌. దగ్గర్నుంచి తాను పరిశీలించిన ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. సెట్లో ఎలా ఉంటాడు? ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనే ఇంట్రస్టింగ్ విషయాలపై తన అభిప్రాయం వెల్లడించింది.

సెట్లో ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడని చెప్పింది శృతి. అంతేకాదు.. అందరితోనూ చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారని తెలిపింది. ఆయన స్టార్ అనే ఫీలింగ్ ను ఏ మాత్రం ప్రదర్శించబోడని చెప్పిన బ్యూటీ.. అతను లొకేషన్లో ఉన్నంత సేపు సందడిగా ఉంటుందని చెప్పింది. అసలు ప్రభాస్ అలా ఉంటాడనే విషయాన్ని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది శృతి. ఆయనతో నటించడం ఎవ్వరికైనా చాలా కంఫర్ట్ గా ఉంటుందని తెలిపింది.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu