టాలీవుడ్ హీరోయిన్ శ్రియ సరన్.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు తెరపై ‘ఇష్టం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తన అందచందాలతో కొన్ని సంవత్సరాలు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం
పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. శ్రియ ప్రస్తుతం భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో నివశిస్తున్నది. ఇటీవల భర్తకు కొవిడ్19 లక్షణాలు రావడంతో డాక్టర్లను సంప్రదించారు. పాజిటివ్ రాకపోవడంతో ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉండమని సలహా ఇచ్చారు వైద్యులు. దీంతో వీరు ఇంటిపట్టునే
ఉంటున్నారు ఈ జంట. ఇంట్లో ఖాలీగా ఉండటంతో రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా శ్రియ ఆన్‌లైన్ క్లాసులు వింటూ యోగాచేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో యోగా ట్రైనర్ సాయంతో యోగాను ప్రాక్టీస్ చేస్తూ శ్రియ అదరగొడుతోంది.