టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితోనూ నటించింది శ్రియ. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. వెండితెర ద్వారా తన అభిమానులను ఎంటర్టైన్ చేయలేకపోతోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మాత్రం వారికి నయనానందాన్ని పంచుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు, ఫాలోవర్లకు తన అందాలను ఆరబోస్తూ కనువిందు చేస్తుంది. ఈ పోస్టుల్లో హాట్ పోస్టులు కూడా ఉంటున్నాయి.
కిందటేడాది మార్చి నెలలో ఆమె తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి విహార యాత్రలో చేస్తోంది. అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఈమధ్యే ఒక డ్యాన్స్ వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇబిజా బీచ్‌లో తీసిన వీడియో అది. ఇబిజా ఐల్యాండ్ అంటే సెలబ్రిటీలకు ఎంతో ఇష్టం. స్పెయిన్‌లో ఉన్న ఐల్యాండ్ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు పెట్టింది పేరు.
ఇదిలా ఉంటే, తాజాగా శ్రియ మరో డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రియ బార్సిలోనాలో ఉంది. అక్కడ వర్షం పడుతోన్న సమయంలో తన ఫ్లాట్ బాల్కనిలో డ్యాన్స్ చేసింది. అది కూడా చిట్టిపొట్టి నైట్ డ్రెస్‌లో. చాలా సెక్సీగా వయ్యారాలు పోతూ చేసిన డ్యాన్స్ అది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే భర్త కొస్చీవ్ వీడియో తీసినట్టున్నాడు. అయితే, ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొంత మంది సూపర్ డ్యాన్స్ అని కొనియాడుతుంటే.. మరికొందరు శ్రియ పదేళ్ల నుంచి ఇదే డ్యాన్స్‌తో విసిగిస్తోందని వెటకారం చేస్తున్నారు.