హీరోయిన్ శ్రియ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న ఈ బ్యూటీ రూ.200 చెల్లించి తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించించింది. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు ఆమె తెలిపింది. కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు, వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపింది. అయితే తనతో డ్యాన్స్ చేయాలంటే www.thekindnessproject.in అనే వెబ్ సైట్‌లో రూ.200 విరాళంగా చెల్లించి.. ఆ రసీదును ఈమెయిల్ చేయాలని పేర్కోంది.