ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీయ శరన్ తరువాత ఆశించినంతగా విజయం సాధించలేదు. ఆ తరువాత సంతోషం సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో శ్రీయ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సంతోషం విజయం తరువాత శ్రీయ టాప్ హీరోలందరితో కలిసి నటించింది.
స్టార్ హీరోల నుంచి కుర్రహీరోలందరితో కలిసి నటించింది. ఇటీవలే ఈ భామ రష్యన్ ఫోటోగ్రాఫర్ ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తరువాత కూడా శ్రీయ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీయ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటె, శ్రీయ ఓ బీచ్ దఒడ్డున బెల్లి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్
పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.