విక్టరీ వెంకటేష్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘రానానాయుడు’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న వెంకీ ఒక్క సారిగా అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోన్నాడు.
దీంతో.. వెంకీ మామా దాన్ని కవర్ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం వెంకటేష్ రెండు సినిమాలను లైన్‌లో ఉన్నాయి. అందులో సైంధవ్ ఒకటి. హిట్ ఫేమ్ సైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, అనౌన్స్‌మెంట్ వీడియో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో వెంకటేష్‌తో ఇద్దరు హీరోయిన్‌లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక హీరోయిన్‌గా రుహాని శర్మ నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే అందులో రుహాని పాత్ర సెకండ్ హీరోయిన్ అట. కాగా మేయిన్ హీరోయిన్‌గా జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్‌ను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మూవీ మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కృష్ణ అండ్ ఈజ్ లీల సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తరువాత నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు