నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి శ్రద్ధా శ్రీనాథ్. ఆ చిత్రంలో ఆమె నాని భార్యగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా తనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది తీసుకున్న ఒక ఫొటోతో పాటు.. 2014లో తీసుకున్న మరో ఫొటోను జత చేస్తూ.. ‘2014 అక్టోబర్.. బాలిలో ఆ ఫొటో తీసుకున్నాను. అదే నా మొట్టమొదటి ఇంటర్నేషల్ టూర్. లా చదువుతున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. మంచి జీతం సంపాదిస్తూ జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేదాన్ని. ఆ సమయంలో బట్టలు, ఆహారం, స్నేహితులతో సరదాగా గడిపేందుకు చాలా డబ్బు ఖర్చు చేశాను. అనుకోకుండా నేను బాగా బొద్దుగా అయ్యాను. అప్పుడు నేను నెలలో కనీసం ఒక్కరోజైనా తప్పకుండా వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ, ఆహారం తినడం మాత్రం మానలేదు. ఆ తర్వాత కొంతకాలానికి నేను మా ఇంటి వద్ద ఉన్న ఓ జిమ్‌లో చేరాను. రోజుకి 40 నిమిషాలపాటు ఆగకుండా వ్యాయామం చేసేదాన్ని’
ఇది ఈ ఏడాది డార్జిలింగ్‌లో తీసుకున్న ఫొటో. 5 సంవత్సరాల తర్వాత నేను 18 కిలోల బరువు తగ్గాను. ఈ ఐదేళ్లలో జిమ్ బాగా చేశాను. ఆహారం విషయంలో నాకు తెలిసిన డైట్ ఫాలో అయ్యాను. ప్రస్తుతం నేను ఆహారం, వ్యాయామాన్ని బ్యాలెన్స్ చేస్తూ పనిచేస్తున్నాను. మీరు కూడా డైట్‌ను ఫాలో అవుతూ.. ఇష్టమైన ఆహారాన్ని మరవకండి. మీ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి’ అని శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ‘జోడి’ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఆది హీరోగా నటించిన ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఆమె పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.