HomeTelugu Trendingబాలీవుడ్‌ హీరో పెళ్లి శ్రద్దా శ్రీనాథ్ కామెంట్స్‌

బాలీవుడ్‌ హీరో పెళ్లి శ్రద్దా శ్రీనాథ్ కామెంట్స్‌

Shraddha Srinath Commentsబాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్, నటాషా దలాల్ సుదీర్ఘ కాలంగా ప్రేమాయణం తరువాత వివాహం బందంతో ఒకటైన సంగతి తెలిసిందే. వారికి ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాని హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ మాత్రం ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వరుణ్ దావన్ మరియు నటాషాల పెళ్లి ఫొటోను షేర్ చేసిన శ్రద్దా శ్రీనాద్.. మరో మంచి హీరో కూడా పెళ్లి అనే దుమ్ములో పడిపోయాడు. ఆయన్ను మళ్లీ వెండి తెరపై చూడలేం అనేందుకు బాధగా ఉంది. ఆయన భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు ఇకపై హీరోయిన్స్ తో నటించేందుకు ఒప్పుకోక పోవచ్చు. అందుకే ఆయన ముందు ముందు హీరో ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాల్సి ఉంటుందేమో. హీరోయిన్ లతో నటించేందుకు ఖచ్చితంగా ఆయన భార్య ఒప్పుకుంటుందనే నమ్మకం లేదు. ఫ్యామిలీ లైఫ్ ను వర్క్ లైఫ్ ను ఆయన ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి. మేము నిన్ను మిస్ అవుతున్నాం వరుణ్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. శ్రద్దా శ్రీనాథ్ ఈ పోస్ట్ ను సరదాగా పెట్టిందా లేదంటే ఆమెకు వరుణ్ పై ఏమైనా క్రష్ ఉందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తనకు పెళ్లి పై నమ్మకం లేదన్న శ్రద్దా శ్రీనాధ్ ఇప్పుడు ఇతరులు పెళ్లి చేసుకున్న విమర్శలు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu