HomeTelugu Trending'సాహో' బ్యూటీ పెళ్లికి రెడీ!

‘సాహో’ బ్యూటీ పెళ్లికి రెడీ!

8 9‘సాహో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 15 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్నది. ఇందులో శ్రద్ధా కపూర్ పవర్ఫుల్ కాప్ పాత్ర చేస్తున్నది.

ఇప్పుడు శ్రద్దా కపూర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమంటే.. శ్రద్దా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రద్దా కపూర్ చిన్ననాటి స్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించాడు. ఇప్పట్లో శ్రద్దా కపూర్ పెళ్లి చేసుకోవడం లేదని, ఆమె దృష్టి మొత్తం తన కెరీర్ పైనే ఉందని చెప్పాడు. సాహో తో పాటు శ్రద్ధా బాలీవుడ్ లో డాన్స్ మూవీ చేస్తున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu