
Shraddha Kapoor New Lexus Car:
బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ లైఫ్‌స్టైల్ అంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమాలు హిట్టవుతుంటే, వారి లైఫ్‌స్టైల్ మరింత గ్రాండ్ అవుతోంది. ఖరీదైన కార్లు తారలకి చాలా ఇష్టం. ఈ మధ్య లెక్సస్ కార్ల మీద మోజు పెరుగుతోంది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.
శ్రద్ధా కపూర్ తాజాగా లెక్సస్ LM 350h కొనుగోలు చేశారు. ఇది 4-సీటర్ లగ్జరీ కార్, దాని ధర దాదాపు రూ. 2.93 కోట్లు. ముంబైలో జిమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె కొత్త కారులో వెళ్తూ కనిపించారు. వైట్ టీ-షర్ట్, బ్లాక్ టైట్స్‌లో కూల్ లుక్‌లో కనిపించిన శ్రద్ధా, ఫోటోగ్రాఫర్లకి స్మైల్ ఇచ్చి కార్లోకి ఎక్కిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ కార్ కేవలం లుక్స్‌కే కాదు, అద్భుతమైన ఫీచర్లకి కూడా ఫేమస్. దీంట్లో ఫస్ట్-క్లాస్ ఫ్లైట్‌లా ఫీల్ వచ్చేలా 48-అంగుళాల స్క్రీన్, సన్‌రూఫ్, మినీ ఫ్రిజ్, వైర్‌లెస్ చార్జింగ్, USB-C పోర్ట్స్ ఉన్నాయి. దీని స్పెషల్ సీట్స్ పూర్తిగా రిక్లైన్ అవుతాయి, అంటే సీటును బెడ్‌లా మార్చుకోవచ్చు!
శ్రద్ధా కపూర్ ఇప్పటికే లంబోర్గిని హురాకెన్ టెక్నికా (రూ. 4 కోట్లు), ఆడి Q7, మెర్సిడెస్ GLA, BMW 7 సిరీస్, మారుతి స్విఫ్ట్ వంటివి కలిగి ఉన్నారు. ఇక ఆమె సముద్ర వీక్షణ హౌస్‌తో పాటు, తండ్రి శక్తి కపూర్‌తో కలిసి రూ. 6.24 కోట్ల కొత్త ఫ్లాట్ కూడా కొన్నారు.
ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ హిట్ తర్వాత కొత్త సినిమాల కోసం సిద్ధమవుతున్నారు.