HomeTelugu Trendingఅనసూయ ఆంటీ వివాదం.. శ్రద్దా సపోర్ట్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

అనసూయ ఆంటీ వివాదం.. శ్రద్దా సపోర్ట్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Shraddha das getting trolle

ట్విటర్‌లో ఆంటీ అనే పదం ట్రెండ్‌ అవుతుంది. సుమారు 60 వేల ట్వీట్లు, మీమ్స్‌, కామెంట్లు, వీడియోలతో ట్విటర్‌ హోరెత్తిపోతోంది. ఆంటీ అని పిలవడం ఏజ్‌ షేమింగ్‌ అని అనసూయ మండిపోతుంటే.. మేము మాత్రం ఆంటీ అని పిలవడం మానేదే లేదంటూ.. దూసుకుపోతున్నారు నెటిజన్లు. ఈ వివాదంలోకి నటి శ్రద్దా దాస్‌ ఎంటరవుతూ అనసూయకు సపోర్టిచ్చింది. నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీకంటే రెట్టింపు వయసున్న అంకుల్స్‌ కన్నా కూడా నువ్వే హాట్‌గా కనిపిస్తావు. ఎల్లప్పుడూ నీకు అభిమానినే అని రాసుకొచ్చింది.

దీంతో.. అనసూయను సపోర్ట్‌ చేస్తావా? అని శ్రద్దాను కూడా ఏకిపారేశారు. దీంతో షాకైన హీరోయిన్‌.. ‘నన్ను తిట్టుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మీరు నన్ను దూషించిన ట్వీట్లన్నీ డిలీట్‌ చేస్తా, అలాగే మీ ఖాతాలను కూడా బ్లాక్‌ చేస్తాను. అనసూయ లుక్స్‌ను పొగిడినందుకు నన్ను ట్రోల్‌ చేయడంలో అర్థం లేదు’ అని ట్వీట్‌ చేసింది.

కాగా అనసూయ గురువారం నాడు.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!’ అని ఆమె ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే కదా! ఇది ఓ హీరోను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడ్డ అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయ మీద మండిపడుతూ వరుస పోస్టులు పెడుతున్నారు. దీనిపై మండిపడ్డ అనసూయ‌.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu