బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిన్ని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి ఎన్‌సీబీ తో అనేక సంచలన విషయాలును వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్‌కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌లో కూడా ఇచ్చినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు.
ఇప్పటికే ఎన్‌సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్‌ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్‌ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్‌ను కలిశాను’ అని తెలిపారు.