కథ:
చిరంజీవి(రవి) అనే యువకుడు శివ తపస్సు చేసి దేవుడు నుండి ఓ వరాన్ని పొందుతాడు. తన
కుడిచేతితో ఏ ప్రాణిని ముట్టుకున్న దానిలో సగం ఆయుష్యూ చిరంజీవి అకౌంట్ లోకి రావాలని
కోరుకుంటుంటారు. అయితే ఈ కోరిక ఎవరికైనా చెబితే మాత్రం జీవశ్చవంగా మారిపోతావని
శివుడు కండీషన్ పెడతాడు. ఇక అప్పటినుండి చిరంజీవి ఆయుష్యూ రోజుకు పెరుగుతునే
ఉంటుంది. అయితే తన వరం కారణంగా చిరంజీవి బాస్ చనిపోతాడు. ఆఖరికి చిరంజీవి
ప్రేమించిన అమ్మాయి కూడా అతడికి దూరమవుతుంది. మరి ఫైనల్ గా చిరంజీవి ఏం చేస్తాడు..?
ఆ వరాన్ని తిరిగి దేవిడిని తీసుకోమని అడుగుతాడా..? తను ప్రేమించిన అమ్మాయి అతడికి
దక్కుతుందా..? అనే అంశాలతో ”చిరంజీవి” అనే షార్ట్ ఫిల్మ్ నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
రవి నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
స్టోరీ
మైనస్ పాయింట్స్:
క్లైమాక్స్
హీరోయిన్
విశ్లేషణ:
తపస్సుతో వరం పొందడం, ఆ వరమే తన పాలిట శాపంగా మారడం అనే పాయింట్ తో డైరెక్టర్
నంద కిషోర్ కథను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రవి తన నటనతో ఆకట్టుకున్నాడు. తన వల్ల
ఎదుటివారి ప్రాణాలు పోతున్నాయని తెలిసి అతడు బాధ పడే సన్నివేశాల్లో చక్కగా నటించాడు.
డైరెక్టర్ రాసుకున్న లైన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ”మంచిగా బ్రతికే మనిషి దేవుడు
అవుతాడు.. కానీ దేవుడు మనిషిలా ఉండడు” అనే డైలాగ్ బావుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్
స్కోర్ ఆకట్టుకుంటాయి. డి.ఐ ఇంకాస్త బాగా చేయాల్సివుంది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా
అంతగా ఆకట్టుకోవు. కథలో డైరెక్టర్ ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్
ఆర్టిస్టుల నటన కూడా షార్ట్ ఫిల్మ్ కు ప్లస్ అయింది. రవి భుజాల మీద ఈ లఘు చిత్రాన్ని
నడిపించాడు. నటుడిగా ఈ సినిమాలో మరో కోణాన్ని చూపించాడు.