HomeTelugu TrendingSpirit: హీరో సరే.. విలన్ కూడా ప్రభాస్ ఏనా?

Spirit: హీరో సరే.. విలన్ కూడా ప్రభాస్ ఏనా?

Shocking update about Prabhas Spirit movie
Shocking update about Prabhas Spirit movie

Spirit Movie Update:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక కల్కి 2898 AD సినిమాతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. 1000కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి.

ఈ మధ్యనే విడుదలైన రాజా సాబ్ ఫ్యాన్ గ్లిమ్స్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. సలార్, కల్కి రెండవ భాగాలు పక్కన పెడితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పిరిట్ అని ఆసక్తికరమైన టైటిల్ తో ఈ చిత్రం త్వరలో మొదలుకానుంది.

ప్రభాస్ ని ఈ సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి.. పాత్రలో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే.. పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఎప్పుడో బిల్లా సినిమా తర్వాత ఇప్పటిదాకా ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయలేదు. కాబట్టి ఫాన్స్ కి ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా ఒక పాత్ర చేస్తున్న సంగతికి తెలిసిందే. విలన్ గా కూడా ప్రభాస్ కనిపించబోతున్నారని టాక్. డ్యూయల్ రోల్ లో ఒక హీరో పాత్ర పోషిస్తున్న ప్రభాస్ విలన్ గా కూడా కనిపించనున్నారు.

ఈ ట్విస్ట్ సినిమా ఇంటర్వెల్ సీన్లో తెలుస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి కూడా చాలా కాలం అయింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu