Bigg Boss 8 Telugu Weekend Elimination:
బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం ఎపిసోడ్ చాలా సస్పెన్స్ తో సాగింది. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో ఇంటి సభ్యులు క్లాన్ ఎంపికలు, ఎలిమినేషన్ల మధ్య ఎన్నో అనుకోని మలుపులు కనిపించాయి. క్లాన్ లీడర్ల ఎంపిక సమయంలో ఇంట్లో రచ్చ మొదలైంది. నిఖిల్ క్లాన్ లీడర్ గా అందరి అభిమానాన్ని గెలుచుకున్నాడు.
విష్ణు, శేఖర్ బాషా, కిరాక్ సీత, సోనియా, ప్రిధ్వి కూడా నిఖిల్ కి వోట్ వేశారు. మరోవైపు, అభయ్ లీడర్ గా మనికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, యష్మి, నబీల్ క్లాన్ ఏర్పడింది. యష్మి అభయ్ క్లాన్ ను ఎంచుకోగా, నానిక నిఖిల్ క్లాన్ లో చేరింది. తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యులలో టెన్షన్ మొదలయ్యేలా చేసింది.
నాగార్జున మొదట విష్ణు ప్రియను సేవ్ చేయగా, మద్యలోనే మనికంఠ సేవ్ అవడంతో హౌస్‌మేట్స్‌కి కొంత షాక్ అయ్యారు. చివరగా సీత, ప్రిధ్వి కూడా నామినేషన్ నుండి బయటపడ్డారు. ఆదివారం ఆటలో శక్తి క్లాన్ గెలిచి ₹15,000 ప్రైజ్ మనీని సంపాదించారు.
ఇక శేఖర్, ఆదిత్య ఓం చివరి రెండు స్థానాల్లో ఉండటంతో వారి భవితవ్యాన్ని మిగతా సభ్యులు నిర్ణయించాలి అని నాగ్ బాంబ్ పేల్చారు. సాధారణంగా ఇలాంటి ట్విస్టులు 7వ లేదా 8వ వారంలోనే వస్తాయి. కానీ రెండో వారం నుంచే ఇలాంటి మలుపు రావడం అభిమానులకు పెద్ద షాక్ గా మారింది.
Read More: Bigg Boss 8 Telugu ఇంటి నుండి ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నారా?
అయితే ప్రతివారం ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓట్స్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ట్విస్ట్ ఏదైనా ఇచ్చి ఇంటి సభ్యులతో ఎలిమినేట్ చేయిస్తే.. వాళ్లు సీక్రెట్ రూమ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఈసారి అలాంటి ట్విస్ట్ ఇంకా ఏదైనా ఉందా అని తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
ఈ క్రమంలో ఆదిత్య ఓం గేమ్ స్పిరిట్, బాధ్యత బావుంటాయి అని హౌస్ లో అందరూ వోట్స్ వేసి శేఖర్ ను ఎలిమినేట్ చేశారు. వెళ్ళిపోతూ శేఖర్ విశ్ణు ప్రియ, సీత, ప్రేరణ నిజమైనవారు అని, సోనియా, మనికంఠ, ఆదిత్య ఓం ఫేక్ అని కామెంట్ చేశాడు.