NTR in Daavudi song:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సినిమా ప్రకటించినప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా సినిమా నుంచి విడుదల అవుతున్న పాటలు ఫాన్స్ కి ఒక రేంజ్ లో నచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన చుట్ట మల్లి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతోంది అని ఈ పాట చూస్తే తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట Daavudi. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ పాటని వెండి తెర మీద చూస్తూ ఉంటే.. ఆ కిక్కే వేరు అంటూ ఫాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కానీ తాజాగా బయటకి వచ్చిన వార్త ప్రకారం ఈ పాట విషయంలో ఫ్యాన్స్ కి ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతోంది. అందరూ అనుకుంటూ ఉన్నట్లు ఈ పాట సినిమా మధ్యలో సిచువేషన్ బట్టి రాదట. సినిమా మొత్తం అయిపోయాక టైటిల్స్ పడుతున్న సమయంలో వస్తుందట. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశ చెందారు.
చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ డాన్స్ చూడాలని ఫాన్స్ వెయిట్ చేస్తూ ఉంటే.. ఇంత మంచి పాట రోలింగ్ టైటిల్స్ సమయంలో వస్తుంది అని తెలిసి ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. అయితే ఈ పాట రోలింగ్ టైటిల్స్ సమయంలో వస్తే.. మరి సినిమాలో మరింకేదైనా డ్యాన్స్ నంబర్ ఉందా అని కూడా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. భారీ అంచనాల మధ్య దేవర సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధం అవుతుంది.