
Soundarya property dispute:
సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి సౌందర్య దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా రాజ్యం చేశారు. ఆమె నటన, అందంతో నేటితరం సావిత్రి అనిపించే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2004లో జరిగిన విమాన ప్రమాదం ఆమె ప్రాణాలను తీసింది. ఆమె మరణం తర్వాత 100 కోట్ల ఆస్తుల వివాదం పెద్దదిగా మారింది.
సౌందర్య తన కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి, హైదరాబాద్, బెంగళూరులో విస్తారమైన ఆస్తులు సంపాదించారు. ఆమెకు ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, నగలు, భవంతులు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నట్లు సమాచారం.
*బెంగళూరు హనుమంత్ నగర్: 42×36 అడుగుల ఫ్లాట్, 2 ఇళ్లు, 3 షాపులు
*బెంగళూరు R&B 2nd Stage: 28×15 మీటర్ల స్థలం
*హెచ్ఆర్బిఆర్ ఎక్స్‌టెన్షన్: 20×24 మీటర్ల ఖాళీ స్థలం
*భవాని హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ: 30×40 అడుగుల స్థలం
*హైదరాబాద్ శంషాబాద్: 6 ఎకరాల ఫామ్ హౌస్
సౌందర్య మరణం తర్వాత ఆమె తల్లి మంజుల, వదిన నిర్మల కోర్టులో ఆస్తుల వివాదం తీర్పు కోసం వెళ్ళారు. 2013లో కోర్టు రాజీకి రావాలని సూచించగా, కుటుంబ సభ్యులు ఆస్తులను పంచుకున్నారు. హైదరాబాద్‌లోని 6 ఎకరాల భూమిని మోహన్ బాబుకు అమ్మారు. ప్రస్తుతం అక్కడ “మంచు టౌన్‌షిప్” ప్రాజెక్ట్ నిర్మించబడుతోంది.
సౌందర్య మేనల్లుడు సాత్విక్ – హనుమంత్ నగర్ ప్రాపర్టీ, ₹25 లక్షల FD
నిర్మల – ₹1.25 కోట్ల ఆస్తులు
మంజుల, రఘు – అగ్రికల్చరల్ ల్యాండ్ ఆదాయం పంచుకున్నారు. ఇప్పటికీ ఆస్తుల ఆదాయంతో ట్రస్టులకు విరాళాలు అందిస్తున్నట్టు సమాచారం.