
Pushpa 2 Collections:
‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్ విజయానికి వెనుక గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ అధినేత మనీష్ షా కీలకపాత్ర పోషించారు. దక్షిణాది సినిమా అయినప్పటికీ హిందీలో భారీగా వసూళ్లు రాబట్టడానికి ఆయన మార్కెటింగ్ టెక్నిక్స్, డబ్బింగ్, ప్రమోషన్ కారణమన్న మాట నిజమే. అయితే ‘పుష్ప 2: ది రూల్’ విషయంలో మాత్రం మనీష్ షా వెనక్కి తగ్గారు.
‘పుష్ప 1’ హిందీ హక్కులను ఆయన రూ. 30 కోట్లకు కొనుగోలు చేసి దాని ద్వారా రూ. 150 కోట్లకు పైగా నికర లాభాలు పొందారు. అయితే, ‘పుష్ప 2’ హిందీ రైట్స్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిబంధనలు మార్చారు. ఈసారి శాతం వారీగా లాభాల్లో వాటా కోరారు. కానీ మనీష్ షా అందుకు అంగీకరించలేదు. ఆ కారణంగా, ‘పుష్ప 2’ హిందీ హక్కులు అనిల్ థడానీ (AA ఫిలిమ్స్) రూ. 200 కోట్లకు కొనుగోలు చేశారు.
గోల్డ్‌మైన్స్ లేకపోయినా ‘పుష్ప 2’ హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం హిందీ వెర్షన్ alone ₹829 కోట్లు వసూలు చేయగా, దేశీయంగా ₹1,255.76 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹1,871 కోట్లతో బాహుబలి 2 రికార్డును దాటేసింది.
ఆయన హిందీ మార్కెట్లో పెద్ద ప్లేయర్ అయినా, ఈసారి లాభభాగస్వామ్య విధానాన్ని అంగీకరించకపోవడం వల్ల 1800 కోట్ల గ్రాండ్ సక్సెస్‌లో భాగం కాలేకపోయారు. గోల్డ్‌మైన్స్ వుండివుంటే వసూళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉండేవేనా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టం.
ALSO READ: Andhra Pradesh Assembly మీటింగ్స్ కి ఈ నాలుగు చానల్స్ కి నో ఎంట్రీ బోర్డు