
Saif Ali Khan knife attack:
బాలీవుడ్ నటుడు Saif Ali Khan పై నిన్న జాతీయ స్థాయిలో ఒక షాక్ ఇచ్చే సంఘటన చోటుచేసుకుంది. సైఫ్ ని దారుణంగా కత్తితో గాయపరిచారు. ఆయనపై ఆరుసార్లు కత్తి పోట్లు ఉన్నాయి. అతన్ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు, ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ తీవ్రంగా గాయపడ్డాడు. సైఫ్ అలి ఖాన్ దేశంలోని అత్యంత ధనవంతులైన నటులలో ఒకరై, బాంద్రాలోని అతి విలాసవంతమైన ప్రాంతంలో నివసిస్తున్నారు.
సైఫ్ ఇంటి లోపల ఎట్లా ఒక దొంగ ప్రవేశించాడో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు నిందితుడి ఫోటోను విడుదల చేశారు. అతను ముంబై లో లొకల్ ట్రైన్ ద్వారా పారిపోయాడు అని పోలీసులు చెప్పారు.
సైఫ్ అలి ఖాన్ లగ్జరీ కార్ల గ్యారేజీ ఉన్నా, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అతని కుమారుడు ఇబ్రాహీమ్ ఆటోలో తీసుకెళ్ళాడు. ఇంటి పనిచేసే ఉద్యోగులు ఈ సంఘటన గురించి హడలిపోతున్నారు. నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలో కనిపించారని జేహ్ నానీ ఎలియామా ఫిలిప్ చెప్పారు. ఆమెమీద కూడా కూడా కత్తి పోటు గాయాలున్నాయట. ఈ కేసును పరిష్కరించేందుకు 20 టీమ్‌లతో పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.
డాక్టర్లు ఈ రోజు సైఫ్ అలి ఖాన్ కు సంబంధించి తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. ఒక నిందితుడు ఈ రోజు అరెస్ట్ అయ్యాడు, కానీ అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. బాలీవుడ్ మీడియా ప్రకారం, నిందితుడు రూ. 1 కోట్ల సొమ్మును డిమాండ్ చేశాడని ప్రచారం జరుగుతోంది.