Shocking facts about Chandrababu Naidu’s brother Nara Ramamurthy Naidu:
నారా రామమూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు. ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి కూడా. 1952లో జన్మించిన రామమూర్తి నాయుడు చిన్ననాటి నుంచి తన అన్న చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత రామమూర్తి నాయుడుకి కూడా రాజకీయాల మీద ఆసక్తి కలిగింది. 1994లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం కూడా సాధించారు.
ఎమ్మెల్యేగా తన పదవీకాలంలో రామమూర్తి నాయుడు పార్టీకి మద్దతు పెంచడానికి ఎంతో శ్రమించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. తన అన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమైన నాయకుడిగా ఉన్నప్పటికీ, రామమూర్తి నాయుడు ఎప్పుడూ జనం ముందుకు రాకుండా సాధారణంగా ఉండేవారు.
అయితే రాజకీయ నాయకుడిగా కంటే.. రామమూర్తి నాయుడు ఒక మంచి కుటుంబ మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు – ఒకరు హీరో నారా రోహిత్, మరొకరు నారా గిరీశ్. నారా రోహిత్ సినిమాల మీద ఆసక్తితో హీరోగా మారి ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా నారా రామమూర్తి నాయుడుని చిన్నాన్న అని పిలుస్తూ ఆప్యాయంగా వ్యవహరించేవారు. గత కొన్నేళ్లుగా రామమూర్తి నాయుడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతూ ఉన్నారు.
అయితే 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన అనారోగ్య పరిస్థితిని రాజకీయం చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కొన్ని ఆరోపణలు చేశారు. రామమూర్తి నాయుడిని తాళ్ళతో బంధించి ఉంచారంటూ ఆయన చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనంగా మారాయి.
ఆ సమయంలో నారా రోహిత్ మీడియా ముందుకు వచ్చి ఆ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మనిషిని ఉపయోగించుకొని రాజకీయం చేయడం చాలా దారుణం అంటూ కామెంట్ చేశారు రోహిత్.
గత కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతూ ఈ నెల 16న హైదరాబాదులో రామమూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు చిత్తూరు జిల్లా నారవారిపల్లెలో జరిగనున్నాయి.