HomeTelugu Big StoriesVishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..

Vishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..

Shocking details about Robbery in Vishwak Sen house
Shocking details about Robbery in Vishwak Sen house

Robbery in Vishwak Sen house:

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి రావడం కొంత ఆలస్యమైంది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు రూ. 2.2 లక్షలు, డైమండ్ రింగ్, బంగారు నగలు అపహరించారని తెలిపారు.

దొంగతనం జరిగిన సమయంలో విశ్వక్ సేన్ ఇంట్లో లేరు, ఆయన ‘ఫంకీ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు.

ఉదయం వాకింగ్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చిన కరాటే రాజు, ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన వెంటనే క్లూస్ టీమ్ ఇంటికి చేరుకుని ఫుట్‌ప్రింట్స్, ఆధారాలను సేకరించింది.

CCTV ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, దొంగ ఉదయం 5:50 గంటలకు ఇంటికి చేరుకుని మూడో అంతస్తికి వెళ్లినట్లు గుర్తించారు. అయితే, అతను ఎలా బయటకు వెళ్లాడు? ఇంకా ఎవరైనా తోడుగా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసులు సందేహాస్పద వ్యక్తులపై విచారణ ప్రారంభించారు. కేసును త్వరగా ఛేదించేందుకు CCTV ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ తన కొత్త సినిమా ‘ఫంకీ’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకుడు కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ దొంగతనంపై పోలీసులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu