Homeపొలిటికల్Amaravati నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ విడుదల అయ్యిందా?

Amaravati నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ విడుదల అయ్యిందా?

Shocking budget released for Amaravati Construction
Shocking budget released for Amaravati Construction

Amaravati Construction Budget:

అమరావతిని మళ్లీ జీవంలోకి తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితం ఇస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ సర్కార్ అమరావతి నిర్మాణం కోసం ఏకంగా రూ. 4,285 కోట్లు విడుదల చేసింది. ఇది మొత్తం నిర్మాణ ఖర్చులో 25 శాతం ముందస్తు డబ్బు కావడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు స్పందనగా కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది.

ఈ నిధులు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నుంచి తీసుకున్న రుణాల ద్వారా సమకూర్చబడ్డాయి. అలాగే కేంద్రం వాటా రూపంలో మరో రూ.750 కోట్లు కూడా కలిపి ఈ మొత్తం వచ్చింది. చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న బలమైన రాజకీయ సంబంధాలు ఇప్పుడు అమరావతికి ఉపయోగపడుతున్నాయి.

వాస్తవానికి అమరావతి చంద్రబాబు కలల నగరం. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అమరావతి నిర్మాణం ప్రాధాన్యతగా తీసుకున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వంగా ఏర్పడటంతో కేంద్రాన్ని ప్రభావితం చేయడంలో చంద్రబాబుకు ఉన్న అనుభవం బాగా ఉపయోగపడుతోంది.

2029 నాటికి అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు పునఃప్రారంభమయ్యాయి. ఒకవైపు నిధుల సమీకరణలో రనౌట్ అవ్వకుండా చూస్తున్న చంద్రబాబు, మరోవైపు నిర్మాణంలో వేగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి నిజంగా అమరావతి కొత్త రూపంలో వెలుగులోకి రానుందని ప్రజల్లో ఆశలు పెరిగాయి. కేంద్రం నుండి ఈ విధంగా భారీ నిధులు రావడం, రాష్ట్రాభివృద్ధికి మంచి సంకేతంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu