Suriya Next Movie Budget:
సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కంగువా’ నవంబర్ 14న భారీ అంచనాల మధ్య విడుదలైంది. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరిగా కనెక్ట్ కాకపోవడంతో నెగటివ్ రెస్పాన్స్‌ను ఎదుర్కొంది. ఈ సినిమా ఫలితంతో సూర్య మార్కెట్ కూడా కొంత దెబ్బ తింది.
ఇప్పుడు సూర్య కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘సూర్య 44’ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆర్జే బాలాజీ డైరెక్షన్లో ‘సూర్య 45’లో నటించనున్నారు. అయితే, సూర్యకు ఎంతో ప్రీతిపాత్రమైన ‘కర్ణ’ ప్రాజెక్ట్ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటోంది.
View this post on Instagram
రాకేష్ మెహ్రా ఈ ప్రాజెక్ట్‌కు 600 కోట్ల భారీ బడ్జెట్‌ను సూచించగా, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఆ బడ్జెట్ తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ‘భాగ్ మిల్కా భాగ్’ (2013) తరువాత రాకేష్ మెహ్రాకు పెద్ద హిట్ లేకపోవడం, ‘కంగువా’ ఫలితం సూర్యపై ప్రభావం చూపడంతో ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడంపై నిర్మాణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాకేష్ మెహ్రా తన బడ్జెట్ తగ్గించకపోతే, ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి.
సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. 600 కోట్ల బడ్జెట్‌తో రాకేష్ మెహ్రా లాంటి డైరెక్టర్‌కు పెట్టుబడి పెట్టడం రిస్క్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రాకేష్ మెహ్రా బడ్జెట్ తగ్గించి, ఇదే సంస్థతో పని చేస్తారా లేదా కొత్త నిర్మాణ సంస్థ కోసం వెతుకుతారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కర్ణ’ భవిష్యత్తు ఏమిటో వేచి చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu లో గ్రూప్ గేమ్ తో దొరికిపోయిన హౌస్ మేట్స్