
Vishwambhara Songs Budget:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా గురించి రోజు రోజుకీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సోషియో ఫాంటసీ జానర్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి ఎదురైన చిన్నచిన్న హర్డిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి. ఎట్టకేలకు సినిమా జూలై 24న థియేటర్లలోకి రానుందని టాక్, దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ “రామా రామా” చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్‌తో పాట చాలా ఇంటెన్స్‌గా అనిపించింది. పాటలో చూపించిన విజువల్స్‌లోనూ గొప్ప స్థాయి కనిపిస్తోంది.
ఈ పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేశారు. నాలుగు భారీ సెట్లు వేసి, 12 రోజుల పాటు పాటను షూట్ చేశారు. అంతేకాదు, 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటను గ్రాండ్‌గా తెరకెక్కించారు. చిరంజీవితో పాటు ఈ పాటలో మరో 15 మంది నటులు కనిపించబోతున్నారు.
చిరంజీవి లుక్ కూడా ఈ పాటలో చాలా స్టయిలిష్‌గా కనిపిస్తుంది. సినిమా మొత్తానికీ ఇది విజువల్ ఫీస్ట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ప్రస్తుతం సినిమాలో చివరి పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మేలో దాని షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. మిగతా షూట్ అంతా పూర్తైపోయింది. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.
ఇప్పటికే పాట, పోస్టర్లకు వచ్చిన రెస్పాన్స్ చూసిన వారు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి విశ్వంభర మళ్లీ మెగాస్టార్ మ్యాజిక్ తిరిగి తీసుకొస్తుందా లేదా చూడాలి!