Mokshagna debut movie budget:
సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు, Mokshagna త్వరలో సినిమాల్లోకి అడుగుపెడతారు అని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 (PVCU 2) లో భాగమని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్త బయటకు వచ్చినప్పటినుంచి, అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా, సామాజిక మాధ్యమాల్లో ఒక రూమర్ వైరల్ అవుతోంది. ఆ రూమార్ ప్రకారం ఈ చిత్రానికి నిర్మాతలు సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని టాక్. సాధారణంగా ఒక డెబ్యూ సినిమా కోసం ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం చాలా అరుదు.
అయితే ఇది కేవలం దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన కథ మీద, అలాగే మోక్షజ్ఞ బ్యాక్ గ్రౌండ్ మీద ఉన్న నమ్మకం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Read More: Mokshagna మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?
ఈ సినిమాని ఎమ్. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సినిమా ఒక పురాణ కథ ఆధారంగా ఉంటుంది అని సమాచారం. సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంటుంది అని సమాచారం. సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వేట ఇంకా జరుగుతూ ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రావచ్చు.
కాగా, ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. మోక్షజ్ఞ ను నటుడిగా ప్రశాంత్ వర్మ ఎలా తయారు చేయబోతున్నారో అని.. నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.