HomeTelugu Big Storiesభారీగా పెరిగిన Kubera సినిమా బడ్జెట్.. ఎంతంటే!

భారీగా పెరిగిన Kubera సినిమా బడ్జెట్.. ఎంతంటే!

Shocking budget for Dhanush starrer Kubera
Shocking budget for Dhanush starrer Kubera

Kubera Movie Update:

తమిళ నటుడు ధనుష్ తన కెరీర్‌ను సమతులంగా కొనసాగిస్తూ తెలుగు సినిమాలు కూడా చేస్తూ అభిమానులను. గతంలో ధనుష్ నటించిన ‘సార్’ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో తన పారితోషికాన్ని కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ డ్రామాతో రూపొందుతుంది. చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

‘కుబేరా’ చిత్రానికి ప్రారంభంలో రూ.90 కోట్ల బడ్జెట్‌ను నిర్ణయించినా, పలు కారణాల వల్ల బడ్జెట్ ఎక్కువైంది. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ రూ.120 కోట్లకు చేరుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తక్కువ రోజుల్లో సినిమాను పూర్తిచేయలేకపోవడంతో నిర్మాతలు అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చింది. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శేఖర్ కమ్ముల కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న ‘కుబేరా’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ALSO READ: Mahesh Babu కి తెలుగు చదవడం రాయడం రాదా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu