Zainab Ravdjee – Akhil Akkineni age gap:
అఖిల్ అక్కినేని తాజాగా జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమం అక్కినేని కుటుంబ ఇంట్లో, దగ్గరి బంధువుల మధ్య జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. జైనబ్ వయసు ఇప్పుడు హాయ్ టాపిక్ అయ్యింది.
జైనబ్ వయసు 39 ఏళ్ళు. అఖిల్ కంటే ఆమె 9 సంవత్సరాలు పెద్దది. ఈ వయస్సు తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జైనబ్ రవ్జీ ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు భారతదేశం, దుబాయ్, లండన్‌లో కూడా సంబంధాలు ఉన్నాయి.
Zainab Ravdjee is 9 years older than her fiancé #AkhilAkkineni. pic.twitter.com/VW8VpkCBtb
— Milagro Movies (@MilagroMovies) November 26, 2024
ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. ఈ వివాహంపై నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ, జైనబ్ అఖిల్‌కు సరైన జీవిత భాగస్వామి అని చెప్పారు.
వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది. మరోవైపు, నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత ధూళిపాళతో పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో అక్కినేని ఇంట్లో వరుసగా పండగ వాతావరణం కనిపించనుంది. ఇప్పటికీ అఖిల్, జైనబ్‌ల వయస్సు తేడా గురించి సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి
ఇది కూడా చదవండి: Bigg Boss 8 Telugu లో బ్లాక్ బ్యాడ్జ్ అందుకున్న హౌస్ మేట్!