
Aamir Khan Girlfriend:
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ Aamir Khan వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా తన ప్రేయసి గౌరి స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేశారు. ఇంతకాలం ప్రచారంలో ఉన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, ఈ కొత్త సంబంధాన్ని స్వయంగా అంగీకరించారు.
గౌరి స్ప్రాట్ ప్రైవేట్ వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడతారని తెలిసింది. ఆమె వయస్సు 46 ఏళ్లు, అంటే ఆమిర్‌తో 14 ఏళ్ల వయస్సు తేడా ఉంది. గత 25 ఏళ్లుగా ఆమిర్‌కు ఆమె తెలుసు, కానీ గత సంవత్సరం నుండి ప్రేమలో పడ్డారు. ఆసక్తికరంగా, ఆమె ఇప్పటికే ఒక 6 ఏళ్ల కుమారుడికి తల్లి కూడా.
మార్చి 12న జరిగిన ప్రీ-బర్త్‌డే డిన్నర్‌లో గౌరి స్ప్రాట్‌ను సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా కలిసినట్లు సమాచారం. ఈ విషయం బయటికొచ్చిన వెంటనే నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. “ఇదేనా లవ్ జిహాద్?” అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తుంటే, “ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు” అంటూ మరికొందరు రిప్లై ఇస్తున్నారు.
ఆమిర్ ఖాన్ తల్లి, పిల్లలు కూడా గౌరి స్ప్రాట్‌ను అంగీకరించారని, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని సమాచారం. ఇకపై ఇద్దరూ కలిసి ఉంటారని కూడా ఆమిర్ వెల్లడించారు. అయితే, గౌరి స్ప్రాట్ మీడియా నుంచి ప్రైవసీ కోరారని, ఆమె ఫొటోలు తీయకూడదని పాపరాజీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు బాలీవుడ్ అభిమానులందరి దృష్టి గౌరి స్ప్రాట్‌పై పడింది. ఈ జంట భవిష్యత్‌లో పెళ్లి చేసుకుంటారా? లేదా అలాగే కొనసాగుతారా? అన్నది చూడాలి!
ALSO READ: Aamir Khan కొత్త గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు