కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ సినీ రంగం పై కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే కరోనా ప్రభావం తగ్గిన తరువాత సినీ రంగంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో.. అనే సందేహంలో అందరిలోనూ.. ఉంది. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని ఆయన చెప్పారు. ఆడియో లాంచ్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ వంటివి ఉండవని తెలిపారు. ప్రమోషన్ల కోసం రోడ్ ట్రిప్‌లు, మాల్స్‌కు వెళ్లడం, థియేటర్‌లకు వెళ్లడం వంటివి ఉండవని అన్నారు. అంతా ఆన్ లైన్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే జరుగుతుందని శోభు చెప్పారు. ఆయన ‘బాహుబలి’ తరువాత నిర్మించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 17నే ఇది ప్రేక్షకుల ముందుకు రావాల్సి వున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.