Sivaji: టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ ఫేం శివాజీ రాజాకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని అన్నాడు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదని, సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని అన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు లేరని అన్నారు.
అనంతపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను శివాజీ కోరారు. డబ్బుల కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు.
ఆయన తాజాగా 90స్ వెబ్ సిరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ఆ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఆ వెబ్ సిరీస్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ క్రమంలో శివాజీ మాట్లాడుతూ నేను సమైఖ్య వాది కాదు నేను ప్రత్యేక హోదా గురించి పోరాడాను తప్ప సమైఖ్య వాదం గురించి కాదు 60 సంవత్సరాల తెలంగాణ కల అది సాకారం అయింది ఓవర్.
రెండు రాష్ట్రాలు.. ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా డైరెక్టుగా పాలిటిక్స్ లో ఎప్పుడు పాల్గొనలేదు. నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా.. నా పిల్లల కోరిక ప్రకారం యాక్టింగ్ బిజీలో ఉన్నానని వెల్లడించారు.
ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ప్రజలకు అండగా ఉంటాను. నన్ను కావాలని మాత్రం ఓ పార్టీకి అంటగట్టొద్దు. ఒకవేళ అంటగట్టాలి అనుకుంటే.. ఆ పార్టీలోకి కచ్చితంగా వెళ్తాను.. అందరి దూల తీర్చేస్తాను. నా జోలికి రావొద్దు.. నేను నిజాలు మాట్లాడుతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. నేను రాజకీయాలకు పనికి రాను. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి ఫలానా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డితో, కేసీఆర్ తో నాకేం సంబంధం లేదు.