టాలీవుడ్ నటుడు, మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేసి స్టంట్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.