‘చుక్కల భూముల’ సమస్యలను జఠిలం చేస్తున్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సినీనటుడు శివాజీ చెప్పారు. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని శివాజీ కోరారు. చంద్రబాబుతో భేటీ అనంతరం శివాజీ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీలోగా చుక్కల భూముల సమస్యను సీఎం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. చుక్కల భూములతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే సంక్రాంతిలోపు ఆమరణ దీక్ష చేపడతానని శివాజీ వెల్లడించారు.