HomeTelugu Trendingఆవార్తలు ఎంత బాధపెడుతాయో మీకు చెప్పలేను: శివజ్యోతి

ఆవార్తలు ఎంత బాధపెడుతాయో మీకు చెప్పలేను: శివజ్యోతి

Shiva jyothi clarity on pre
యాంకర్‌ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్‌ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో శివజ్యోతి స్పందించింది.

ఈ సందర్బంగా ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్‌కి వెళుతూ.. మామిడి కాయతో ఫొటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ప్రభావం చూపిస్తుంది. అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం నేను మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది.

ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్‌ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్‌.. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్‌ ఉంటే నేనే మీ అందరితో షేర్‌ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu