బాలీవుడ్ నటి కంగనా తాజాగా చండీగఢ్ ముంబైలో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం కంగనాకు వై కేటగిరి భద్రతను కల్పించింది. కంగనా శివసేన కార్యకర్తలకు ముంబై కి వస్తాను దంమ్ముంటే ఆపండి అంటూ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమె వస్తుందన్న సమాచారం అందుకున్న శివసేన కార్యకర్తలు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. దాంతో భారీ సంఖ్యలో పోలీసులు అకెక్కడికి చేరుకున్నారు. కంగనా గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెతించారు. దాంతో కంగనాకు నేరుగా రన్ వే నుంచి క్షేమంగా ఆమె ఇంటికి తరలించారు.
శివసేన కీలక నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ముంబైకి తిరిగి రావద్దంటూ బెదిరించారని కంగనా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై బీజేపీ నాయకుడు ప్రవేష్ సాహిబ్ సింగ్ స్పందిస్తూ.. ముంబై ఎవరి సొత్తు కాదు. అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించాడు. అలాగే కంగనా క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన పార్టీ నేతలు కార్యకర్తలు కంగనాను హెచ్చరించారు. అయితే దానికి కంగనా ..”ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు, కాబట్టి నేను వచ్చే వారం సెప్టెంబర్ 9 న ముంబైకి వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నేను ముంబై విమానాశ్రయంలో దిగే సమయాన్ని పోస్ట్ చేస్తాను. ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి” అంటూ కంగనా ఓపెన్ సవాల్ విసిరింది.