పిక్ టాక్ : ముప్పై ఏళ్లుగా అవే అందాలు !

బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది శిల్పా శెట్టి. ఈ అమ్మడు ఒక దశలో అనగా రెండు దశాబ్దాల క్రితం ఓ రేంజ్ లో హిందీ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఐతే, 48 సంవత్సరాల వయసులో కూడా శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్ చేస్తూ, అందులోనూ పరిధి దాటి మరీ గ్లామర్ షో చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. ఇటు అందాలు ఆరబోస్తూనే అటు అదరగొట్టే ఫోజులతో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో అందాలు ఆరబోయడమే తన పనిగా పెట్టుకుంది.

Shilpa Shetty New Photoshoot Stills
Shilpa Shetty Photoshoot Still

ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి శిల్పా శెట్టి కసరత్తులు చేస్తోంది. తన మనసుకి బాగా నచ్చే కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒక హీరోయిన్ తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని ముప్పై ఏళ్ల పాటు ఒకేలా కాపాడుకుంటూ రావడం అంటే ఆశ్చర్యకర విషయమే. కానీ, ఆ ఆశ్చర్యాన్ని సైతం అబ్బురపరిచింది శిల్పా శెట్టి. కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో ఎలా ఉందో.. నేటికీ అలాగే ఉంది. కాదు, అలాగే తన బాడీని మెయింటైన్ చేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం విషయంలో ఎన్ని భయాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పైగా శిల్పా శెట్టికి ఇప్పటికీ హీరోయిన్ గా నటించగలదు. మూడేళ్ళ క్రితం వరకూ అక్షయ్ కుమార్ తో నటించింది కూడా. అంతటి సెల‌బ్రిటీ హీరోయిన్ గా చ‌లామ‌ణి అవుతున్న శిల్పా శెట్టి జీవితాన్ని ఒక్కసారిగా ఆమె భ‌ర్త బూతు వ్య‌వ‌హారంలోకి నెట్టేశాడు. భర్త అరెస్టు అయి జైల్లో ఉన్న సమయంలో.. శిల్పా శెట్టి ఇల్లు దాట‌లేక మానసికంగా ఎంతో నలిగిపోయింది. దీనికితోడు శిల్పా శెట్టి చుట్టూ ఎన్నో సమస్యలు.. మరెన్నో బాధలు.. అన్నిటికీ మించి నెత్తి మీదకు వచ్చే బాధ్యతలు.. వీటన్నింటి మధ్య అందాన్ని, ఆ అందం క‌న్నా హుషారును కాపాడుకోవడం అంత సులభమైన విషయం కాదు. అయినా, శిల్పా శెట్టి వాటన్నిటినీ దైర్యంగా ఎదుర్కొంది. పైగా మళ్లీ యాక్టివ్ అయ్యింది.

Shilpa Shetty New Image
Shilpa Shetty New Still

ఐతే, శిల్పా శెట్టి తో నటించిన హీరోయిన్లు అందరూ ప్రస్తుతం అమ్మ, అమ్మమ్మ వేషాలు వేస్తున్నారు. కానీ, శిల్పా శెట్టి మాత్రం ఇంకా హీరోయిన్ మెటీరియల్ గానే ఉండటం విశేషం. తాజాగా శిల్పా శెట్టి ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా శారీలో అదిరిపోయే అందంగా మెస్మరైజ్ చేసింది. ఈ వయస్సులో కూడా అందంతో శిల్పా శెట్టి మెరవడం విశేషం. కచ్చితంగా శారీలో ట్రెడిషనల్ ఇండియన్ విమెన్ లుక్ లో శిల్పా శెట్టిని చూస్తే కచ్చితంగా అలా చూస్తూ ఉండిపోవడం పక్కా అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu