HomeTelugu Big Storiesపెళ్లిరోజు సందర్భంగా.. ఫొటోలను షేర్‌ చేసిన శిల్పాశెట్టి

పెళ్లిరోజు సందర్భంగా.. ఫొటోలను షేర్‌ చేసిన శిల్పాశెట్టి

Shilpa shetty and raj kundr

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ క్రమంలో ఈ క్రమంలో శిల్పా రాజ్‌ వ్యవహారంతో బాగా కలత చెందిందని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని నిరూపిస్తూ శిల్పా తమ పెళ్లి రోజు సందర్భంగా రాజ్ కోసం ప్రత్యేక పోస్ట్ చేసింది. నవంబర్‌ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్‌ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేసింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్‌ను పోస్ట్‌ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శిల్పాశెట్టి తన వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ “ఈ క్షణం నుంచి 12 సంవత్సరాల క్రితం. మేము మంచి, చెడు సమయాల్లో కలిసే ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేశాము. ఈరోజు కూడా ఈ హామీని నెరవేరుస్తున్నాం. మేము ప్రేమను నమ్ముతాము. దేవుడు ఎప్పుడూ మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. హ్యాపీ యానివర్సరీ కుక్కీ… ఇక్కడ మరిన్ని రెయిన్‌బోలు, సంతోషం, మైలురాళ్ళు, మా అత్యంత విలువైన వస్తువు… మా పిల్లలకు’అంటూ పెళ్ళినాటి ఫోటోను షేర్ చేసింది శిల్పా. ఈ ఫొటోల్లో శిల్పా ఎరుపు రంగు పెళ్లి చీర, భారీ ఆభరణాలను ధరించగా, మరోవైపు రాజ్ శిల్పా దుస్తులతో సరిపోయే షేర్వాణీ, సెహ్రాను ధరించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu