డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొత్త హీరోహీరోయిన్లతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆయన మరో కథను సిద్ధం చేసుకుని, నాగచైతన్య – సాయిపల్లవి జంటగా సినిమా రూపొందించడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, హైదరాబాదులో ఈ రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
హీరోహీరోయిన్ల మధ్య కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. శేఖర్ కమ్ముల కథలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని ఉంటాయి. యూత్‌ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగనుందని అంటున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.