HomeTelugu TrendingBigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?

Shekar Basha leaves Bigg Boss 8 Telugu with a grand paycheck
Shekar Basha leaves Bigg Boss 8 Telugu with a grand paycheck

Bigg Boss 8 Telugu Shekar Basha Earnings:

Bigg Boss 8 Telugu ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రతిరోజు కొత్త డ్రామాలతో, అనూహ్య ఎలిమినేషన్లతో ముందుకు సాగుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో, 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

మొదటి వారం ఎలిమినేషన్‌లో, బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత, రెండవ వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఏడుగురు ఇతర హౌస్‌మేట్లతో కలిసి నామినేట్ అయిన శేఖర్, చాలా తక్కువ ఓట్లు సాధించడంతో ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యాడు.

శేఖర్ బాషా టాలీవుడ్ లో రెండు దశాబ్దాల నుండి సుపరిచితమైన వ్యక్తి. అతను ప్రముఖ రేడియో జాకీగా గుర్తింపు పొందాడు. అయితే, బిగ్ బాస్ షోలో అతని ప్రయాణం ఎక్కువ కాలం నిలవలేదు. తన ప్రయాణం చిన్నదైనా, శేఖర్ మాత్రం భారీ రెమ్యూనరేషన్ అందుకునే ఇంటి నుంచి బయటకి వచ్చినట్టు సమాచారం.

Read More: Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు

ప్రతీ వారం రూ. 2.5 లక్షలు రెమ్యూనరేషన్ డీల్ తో శేఖర్ బాషా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు అతనికి మొత్తం రూ. 5 లక్షలు అందాయి. మరోవైపు షో మూడవ వారంలోకి వచ్చేసింది. ఈ వారానికి నామినేషన్లు కూడా అయిపోయాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu