టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శర్వానంద్ కొత్తగా ఒక పోలీస్ స్టోరీకి ఓకే చెప్పాడంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శర్వానంద్ గతంలోనే పోలీస్ స్టోరీతో ‘రాధ’ అనే టైటిల్ తో వచ్చాడు. ఆ కామెడీ పోలీసుగా నటించిన శర్వానంద్ తాజాగా కమిట్ అయిన పోలీస్ స్టోరీలో మాత్రం చాలా సీరియస్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చాయి. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కనుక శర్వానంద్ చేయబోతున్న ఈ సీరియస్ పోలీస్ రోల్ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. త్వరలో ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందట.