ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో నటిస్తోన్న హీరోలు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కూడా అందుకుంటున్నారు. తమ రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని హీరోలు సినిమా మీద పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్మాతకు కాస్త ఇబ్బంది తగ్గుతుంది. సినిమా హిట్ అయితే ఆ లాభాల్లో వాటాలు హీరోకు కూడా దక్కుతాయి. తాజాగా శర్వానంద్ కూడా సినిమాల్లో వాటాలు అడుగుతున్నాడట. వరుస విజయాలతో చిన్న హీరో స్థాయి నుండి మీడియం రేంజ్ ఉన్న హీరోగా ఎదిగాడు శర్వా. తన సినిమా అంటే కనీసం 10 కోట్ల పెట్టుబడిని పెడుతున్నారు.
శర్వాకు అనుకున్న బడ్జెట్ కు మించి ఖర్చు పెట్టొద్దని నిర్మాతలకు ముందే చెప్పేస్తాడట. వీలైనంత వరకు తన సినిమా సేఫ్ జోన్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు తన పారితోషికానికి బదులుగా సినిమాలో వాటా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. 10 కోట్ల బడ్జెట్ సినిమా ఇరవై కోట్ల బిజినెస్ చేస్తే.. తద్వారా వచ్చే లాభం రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఈ హీరో కూడా వాటాకే ఓటేస్తున్నాడు.