యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. శర్వా ఈ సినిమాలో రైతుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 24 విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావించింది. కాగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ అన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో శర్వా ‘శ్రీకారం’ కూడా తిరుపతిలో ప్రారంభమైనట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు.