టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా సీరియస్ డ్రామాగా సాగనుంది. ఈ నేపధ్యంలో శర్వానంద్ 30 వ సినిమా 30వ సినిమా ప్రకటించాడు. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ‘ఒకే ఒక జీవితం’ పేరుతో తెరకెక్కతుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పల్లెకీ .. పట్టణానికి మధ్య హీరో జీవితం ఎలా సాగింది? ఆయనకి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరగనున్నట్టుగా తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అమల ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.