టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రను పోషించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను తెలుగు.. తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు హైదరాబాదులో .. జేఆర్సీ కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనేది ఇంకా ప్రకటన చేయలేదు. భారీ స్థాయిలోనే ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇది కేవలం మదర్ సెంటిమెంట్ కి సంబంధించిన సినిమా అని మొన్నటివరకూ అనుకున్నారు. ఆ సెంటిమెంట్ అనేది టైమ్ ట్రావెల్ తో ముడిపడి ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచారు.