హీరో శర్వానంద్ తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న శర్వానంద్ హనీమూన్ కోసం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాకి ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో శర్వా ఓ చిన్న పాపకు త్రండిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పాప చుట్టూ ఈ కథ నడుస్తుంది అని టాక్.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. “బాబ్” అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. ఇప్పటికే ‘లండన్’లో చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో హనీమూన్ నుంచి వచ్చాక సినిమా బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తారు.