టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో తన తదుపరి చిత్రాలపై శర్వా దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు చిత్రాలు అంగీకరించాడు. వీటిలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ‘మహాసముద్రం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా మరొకటి. వీటిలో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్ ఈమధ్యే తిరుపతిలో మొదలైంది.
తాజాగా మరో చిత్రానికి శర్వానంద్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రీరామ్ గతంలో దర్శకుడు దేవా కట్టా వద్ద పనిచేశాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..