యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభం నుండి నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. అలాగే షెడ్యూల్ .. షెడ్యూల్ కి కూడా గ్యాప్ తీసుకుంటూ తాపీగా షూటింగ్స్ పెట్టుకుంటూ ఈ హీరో. శర్వానంద్ ఎంచుకునే కథల కారణంగానే అటు యూత్ .. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఆయన సినిమాల కు మంచి క్రేజ్ ఉంది.
ఈ కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. పాపం ఇప్పుడు ఈ హీరోకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. అయినా ఆయన తన పారితోషికం విషయంలో తగ్గడం లేదట. సినిమాకి ఆయన 7 కోట్ల వరకూ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. పారితోషికం విషయంలో తగ్గేది లేదని ఆయన చెబుతుండటంతో, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వా మాత్రం ‘శ్రీకారం’తో పాటు ప్రస్తుతం తన చేతిలో వున్న మూడు సినిమాలతో బీజీగా ఉన్నాడు.