హీరో శర్వానంద్, సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’. సి.ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సూపర్‌హిట్ ’96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం యువ హృదయాలను ఆకట్టుకునేలా, భావోద్వేగాల సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దారు ఈ ట్రైలర్. ‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా, ఏదో జరగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది” అంటూ సమంత చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’ అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ హృదయాలను హాతుకుంటుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా, గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు.