Sharmila about Jethwani arrest:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు షర్మిల. జగన్ సొంత చెల్లెలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిల జగన్ మీద కన్నెర్రజేశారు. ముంబయి నటి కదంబరి Jethwani Arrest విషయంలో, ఆమె మీద దాఖలు చేసిన తప్పుడు కేసు వెనుక జగన్ మాస్టర్‌మైండ్ ఉంది అని శర్మిల ఆరోపించారు.
శర్మిల జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ముంబయి నటి కదంబరి జేథ్వానీని అక్రమ కేసులో ఇరికించి, విజయవాడ గెస్ట్ హౌస్‌లో మూడు రోజులపాటు టార్చర్ కి గురిచేయడానికి జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.
శర్మిల మాటల ప్రకారం, ఇండస్ట్రియలిస్ట్ సజ్జన్ జిందాల్‌తో జగన్‌కు రహస్య ఒప్పందం ఉందని, కడపలో రూ. 8,800 కోట్ల వ్యయంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జిందాల్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు.
2023 ఫిబ్రవరి 15న జగన్ పునాదిరాయి వేసినప్పటికీ, అక్కడ ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా కదలలేదు కానీ, 3,500 ఎకరాల భూమి జిందాల్‌కు అప్పగించారని శర్మిల ఆరోపించారు.
“జిందాల్ తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను తరచూ కలవడం స్టీల్ ప్రాజెక్ట్ విషయంలో అని అనుకున్నాను.. కానీ అసలు కుట్ర ఇప్పుడు బయటపడింది,” అని శర్మిల అన్నారు.
జగన్, జిందాల్ కలిసి నటి కెరీర్‌ను నాశనం చేయాలని కుట్ర పన్నారని, ఆమెను కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. “ఆమె న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ. సజ్జన్ జిందాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన తర్వాత, ఆమెను టార్చర్ చేయడానికి జగన్ సాయం చేశారు” అని షర్మిల చెప్పుకొచ్చారు.
స్వయంగా ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన జగన్ ఒక మహిళపై ఈ స్థాయిలో కుట్ర పన్ని.. టాప్ పోలీసు అధికారులను ఉపయోగించి మరీ ఆమెను తప్పుడు కేసులో ఇరికించి, టార్చర్ చేశాడు అని.. జగన్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.