YS Jagan Properties:
ఈ మధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలలో.. వైసిపి పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో ఓడిపోయారు. 175 సీట్లు ఉంటే.. ఎన్నికలకు ముందు వరకు వై నాట్ 175 అంటూ నినాదాలు చేసిన జగన్ కి.. ఎన్నికల తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
అయితే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత నుంచి జగన్ ఆంధ్రప్రదేశ్లో కంటే బెంగళూరులోనే ఎక్కువగా గడుపుతున్నారు. అసెంబ్లీ సెషన్లకి కూడా హాజరవ్వకుండా బెంగళూరుకి వెళ్లి కూర్చుంటున్నారు. గడిచిన 40 రోజుల్లో జగన్ ఏకంగా నాలుగు సార్లు బెంగళూరు వెళ్లి వచ్చారు. దీంతో జగన్ ఎందుకు ఇన్నిసార్లు బెంగళూరు వెళుతున్నారు అంటూ అనుమానాలు మొదలయ్యాయి.
ఇంతకుముందు వరకు హైదరాబాద్ లోటస్ పాండ్ జగన్ అడ్దాగా ఉండేది. పోనీ అలా అనుకున్నా ఎన్నికల తర్వాత జగన్ హైదరాబాద్ చుట్టూ తిరగాలి కానీ బెంగళూరు ఎందుకు వెళుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. తాజా సమాచారం ప్రకారం జగన్ ఎన్నిసార్లు బెంగళూరు రావడానికి కారణం తన సొంత చెల్లెలు షర్మిల రెడ్డి అని తెలుస్తోంది.
నిన్న మొన్నటిదాకా వైసీపీకి మద్దతుగా ఉన్న వైఎస్ షర్మిల ఈ మధ్యనే పార్టీ మార్చి కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నారు. అప్పటినుంచి జగన్ మీద ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈమె జగన్ మీద వేసే కౌంటర్లు వైరల్ అవుతూనే ఉంటాయి.
హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒకవైపు ఇప్పుడు షర్మిల తన కుటుంబంతో ఉంటోంది. ఈ నేపథ్యంలో షర్మిల, జగన్ మధ్యలో ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు కూడా వస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే లోటస్ పాండ్ వదిలేసి జగన్ బెంగళూరు చుట్టూ తిరుగుతున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లోటస్ పాండ్ లో ఉన్న ప్రాపర్టీని వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కట్టారు. ఆ ప్రాపర్టీ మొత్తం తీసుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తన వాటా తనకి దక్కడం కోసం షర్మిల అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు.
అందుకే జగన్ బెంగళూరు వెళుతున్నారు అని కామెంట్లు వస్తున్నాయి. ఒకవేళ జగన్ పర్మినెంట్ గా బెంగళూరులో ఉండిపోయేటట్టే అయితే.. షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ ప్రాపర్టీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.