HomeTelugu Trendingనేను బ్రతికే ఉన్నా: శారద

నేను బ్రతికే ఉన్నా: శారద

sharadha

ప్రముఖ సీనియర్‌ నటి శారద కన్నుమూశారంటూ ఆదివారం సోషల్‌ మీడియా లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అది చూసి సినీ ప్రముఖులు, నటీనటుటు ఆమె అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే దీనిపై స్పష్టత కోసం వారంత ఎదురు చూశారు. దీనిపై స్పందించిన శారద తాను బతికేఉన్నానంటూ ఆడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

‘నేను బ్రతికే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో చెన్నైలోని నా నివాసంలో ఆనందంగా ఉన్నాను. కాకపోతే కాస్తా నలతగా ఉంది అంతే. నా ఆరోగ్యంపై, నా మృతి సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు అందరూ ఆందోళ చెందుతున్నారు. దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించకండి. నిజానిజాలు తెలుసుకొకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu